యూపీఐ జోరు.. అక్టోబర్‌లో రూ.27 లక్షల కోట్ల లావాదేవీలతో కొత్త రికార్డు

భారత్ న్యూస్ విశాఖపట్నం..యూపీఐ జోరు.. అక్టోబర్‌లో రూ.27 లక్షల కోట్ల లావాదేవీలతో కొత్త రికార్డు!

అక్టోబర్‌లో భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు

నెలలో 2070 కోట్ల లావాదేవీలతో రూ.27.28 లక్షల కోట్ల చెల్లింపులు

గతేడాదితో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 25 శాతం వృద్ధి

2025 ప్రథమార్థంలో 106 బిలియన్లకు చేరిన ట్రాన్సాక్షన్లు

దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాల్లో భారీగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు

దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగం అప్రతిహతంగా కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు మరోసారి సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో మొత్తం 20.70 బిలియన్ (2070 కోట్లు) లావాదేవీలు జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) శనివారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

ముఖ్యంగా వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) జరిగే లావాదేవీలు 37 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారాలు డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా స్వీకరించడమే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. దీనినే “కిరాణా ఎఫెక్ట్”గా అభివర్ణించింది. అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల నెట్‌వర్క్ కూడా 2025 జూన్ నాటికి 678 మిలియన్లకు చేరి, జనవరి 2024తో పోలిస్తే 111 శాతం వృద్ధిని నమోదు చేసింది.