ప్రకాశం బ్యారేజీ నుంచి 5.80 లక్షల క్యూసెక్కుల విడుదల..!

భారత్ న్యూస్ నెల్లూరు….ప్రకాశం బ్యారేజీ నుంచి 5.80 లక్షల క్యూసెక్కుల విడుదల..!

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 5,82,710
క్యూసెక్కుల కృష్ణానది వరద నీటిని విడుదల చేస్తున్నట్లు కృష్ణా రివర్ కన్జర్వేటివ్ ఈఈ రావెళ్ల రవి కిరణ్
తెలిపారు.

ఎగువ ప్రాంతాల్లోని వర్షాలు, మునేరు వాగు నుంచి భారీగా వరద చేరుతుండటంతో, బ్యారేజీలోని అన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.