అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌కు అహ్వానం

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌కు అహ్వానం అందింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు. నవంబర్‌ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైయస్‌ జగన్‌ను కోరారు.

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసిన కడప మాజీ మేయర్‌ సురేష్‌ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్‌ ముజావర్‌ అమీరుద్దిన్‌, మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు.