భారత్ న్యూస్ మంగళగిరి…మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విసృతంగా పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజక వర్గం పులిగడ్డ వద్ద రోడ్ సైడ్ కూరగాయలు, కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే వారిని, ప్రజలను కలుసుకున్నారు. తుపాను ప్రభావం గురించీ, వారి కుటుంబ పరిస్థితి గురించి ఆరా తీశారు. శ్రీమతి గొర్రె నాగసూరి అనే మహిళ.. భర్తను కోల్పోయాక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. శ్రీ పెద్ద వెంకటేశ్వరరావు అనే వృద్దుడికి చెందిన దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి, ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీ బొర్రా రాము అనే ఆటో డ్రైవర్ ను పలుకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
