పోలీసు కళ్యాణమండపంలోజిల్లా పోలీసులు ఉపయోగించే ఆయుధాల ప్రదర్శన నుగుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు

భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు

పోలీసు కళ్యాణమండపంలో
జిల్లా పోలీసులు ఉపయోగించే ఆయుధాల ప్రదర్శన ను
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ…

ప్రతి సంవత్సరం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.

పోలీస్ అధికారులు ఏమేమి ఆయుధాలు వాడుతున్నారో అనేది విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.

పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తుందో తెలియజేయడం జరిగిందన్నారు.

గుంటూరులోని విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ ఓపెన్ హౌస్ ప్రదర్శనకు రావడం జరిగిందని చెప్పారు

ఈ ఓపెన్ హౌస్ వలన విద్యార్థులలో అవగాహన మరింత పెరుగుతుందని తెలిపారు.

ఈ ఆయుధాలను ఏ సమయంలో ఎలా ఉపయోగిస్తారో అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించామని చెప్పారు.

దీనివలన విద్యార్థులకు తమ లక్ష్యాలను నెరవేర్చునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు.

ఈ ఆయుధాల ప్రదర్శన పై
స్కూల్స్, కాలేజీలలో పోలీసులు తరఫున క్విజ్ కాంపిటేషన్ నిర్వహించడం జరిగిందని అన్నారు.

ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.