అమీర్‌పేట్‌లో 521 గ్రాముల గంజాయి స్వాధీనం

..భారత్ న్యూస్ హైదరాబాద్….అమీర్‌పేట్‌లో 521 గ్రాముల గంజాయి స్వాధీనం

బుధవారం అమీర్‌పేట్‌లో గంజాయి విక్రయిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన కుందన్‌కుమార్‌ జా అనే వ్యక్తిని ఎస్టిఎఫ్‌ సి టీం అరెస్ట్ చేసింది. సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మంజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నిందితుడి వద్ద 521 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి, నిందితుడిని అమీర్‌పేట్ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు…