భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….భద్రాచలం నుండి మారేడుమిల్లి మీదుగా రాజమండ్రి చేరుకునే ఘాట్ రోడ్ను మూసివేశారు.
మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గుట్టలపై నుండి మార్గమధ్యంలో రహదారులపై కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో ఏ పి ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే పాపికొండలు పర్యాటకాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు…..
