ఏపీ తీరంపై విరుచుకుపడుతున్న తుఫాన్లు

భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీ తీరంపై విరుచుకుపడుతున్న తుఫాన్లు

Oct 27, 2025,

ఏపీ తీరంపై విరుచుకుపడుతున్న తుఫాన్లు
బంగాళాఖాతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తుఫాన్ల తీవ్రత పెరుగుతోంది. ఏటా మే, అక్టోబర్-నవంబర్ నెలల్లో వచ్చే తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో తీవ్ర పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. 1971 నుంచి ఇప్పటివరకు దాదాపు 60 తుఫాన్లు తీరం దాటాయి. 2014లో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ అత్యంత తీవ్ర నష్టాన్ని కలిగించగా, ప్రస్తుతం ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల గంటకు 100-120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది, ఇది కొబ్బరి, అరటి తోటలతో పాటు విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపవచ్చు.