భారత్ న్యూస్ మంగళగిరి…అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్స్ సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…తుపాను సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలన్న సీఎం గారి ఆదేశాల మేరకు కోస్తా జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మొంథా తుపాన్ హెచ్చరికలు
రియల్‌టైమ్ వాయిస్ అలర్ట్‌లను క్షణాల్లో అందిస్తున్నారు.
విద్యుత్ అంతరాయం జరిగినా 360° హార్న్ స్పీకర్ వ్యవస్థ, ఒక కిలోమీటరు పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది.ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాల్లో విస్తరించునున్నారు.

ప్రజలకు మెసేజెస్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టాంటాంలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా, అన్ని విధాలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.