ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇక ఛత్రపతి శంభాజీ నగర్‌ స్టేషన్‌

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇక ఛత్రపతి శంభాజీ నగర్‌ స్టేషన్‌

మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌ రైల్వేస్టేషన్‌గా మార్చింది. అదే విధంగా ఇస్లాంపూర్‌ పేరును ఈశ్వర్‌పూర్‌గా మారుస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడి గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔరంగాబాద్‌ నగరం, రైల్వేస్టేషన్‌కు గతంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పేరు పెట్టిన విషయం తెలిసిందే.

ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ను 1900లో నిర్మించారు. ఏడవ నిజాం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ దీనిని ప్రారంభించారు.