భారత్ న్యూస్ రాజమండ్రి…జాగ్రత్తల పై సమీక్ష సమావేశం

Ammiraju Udaya Shankar.sharma News Editor…మొంథా తుపాను దృష్ట్యా ముందస్తు ఏర్పాట్ల పై ఈరోజు కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ గారితో కలిసి పాల్గొన్నాను. సీఎం చంద్రబాబు గారి ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై, సహాయక చర్యలను చేపడుతుంది. కాకినాడ జిల్లాలోని 6 మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రభుత్వం మొత్తం 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు. 27, 28, 29 తేదీల్లో తీవ్రగాలులు, అత్యంత భారీ వర్షాలు కురవనున్నందున ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించటం జరిగింది. సహాయకచర్యల కోసం ఇప్పటికే ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను, 100 మంది గజఈతగాళ్లను, 70 బోట్లను సిద్ధం చేయటం జరిగింది.
