తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి..!మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు..

భారత్ న్యూస్ విజయవాడ…తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి..!
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు..

తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కోడూరు మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోడూరు మండల ఇంచార్జ్ తహసిల్దార్ సౌజన్య కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవరద్రోణి క్రమంగా బలపడి తీవ్ర చక్రవాతంగా 28 అక్టోబర్ నాటికి మారే అవకాశం ఉందని
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిందన్నారు.

దీని ప్రభావంతో తదుపరి నాలుగు రోజులపాటు తీర ప్రాంతాలలో, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

కావున ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశాలలో ఉండి, అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్ల బయటకు రావొద్దని సూచించబడుతుంది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు.

రెవెన్యూ, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయం చేసుకొని,కోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంటాయని తెలిపారు.

మండల కార్యాలయంలో నిరంతరం (24 గంటలు) పని చేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందన్నారు

అత్యవసర సహాయం కోసం సంప్రదించవలసిన నంబర్లు:
☎️ 08671-294648 / 9908664613