ఆసీస్ పై భారత్ ఘన విజయం..

భారత్ న్యూస్ అనంతపురం…ఆసీస్ పై భారత్ ఘన విజయం..

AUSతో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల టార్గెట్ను 38.3 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. రోహిత్ సూపర్ సెంచరీ(121)తో చెలరేగగా కోహ్లి (74) విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ను ముగించారు. కెప్టెన్ గిల్ (24) మరోసారి నిరాశపర్చినప్పటికీ ‘RO-KO’ అద్భుత ప్రదర్శనతో వైట్వాష్ గండాన్ని తప్పించారు. కాగా తొలి 2 మ్యాచ్ ఓటమితో భారత్ సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే