భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….అది నిరూపిస్తే.. రాజీనామా చేస్తా’.. పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు
TG: బాన్సువాడ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని.. తన స్వార్థం కోసం కలిసి ఉంటే చెప్పుతో కొట్టండి అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. ప్రజలకు హానీ కలిగించే పని జీవితంలో చేయబోనని వెల్లడించారు. వ్యక్తిగతంగా తన కోసం ఇప్పటివరకు సీఎం రేవంత్ని ఏదైనా అడిగినట్లు నిరూపిస్తే.. తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని పోచారం ప్రకటించారు.
