మల్లోజుల, ఆశన్నలకు శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మల్లోజుల, ఆశన్నలకు శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక

Oct 21, 2025,

మల్లోజుల, ఆశన్నలకు శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు జనజీవన స్రవంతిలో కలిసిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల చేసింది. విప్లవోద్యమానికి ద్రోహం చేసిన వీరికి అమరుల సాక్షిగా శిక్ష తప్పదని శపథం చేసింది. పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగని తీవ్రమైన నమ్మక ద్రోహం చేశారని పేర్కొంది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులను హత్య చేయడానికి నిరసనగా ఈ నెల 23 వరకు నిరసన వ్యక్తం చేయాలని, 24న దేశావ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరింది.