గూగుల్ డేటా సెంటర్ తో మారనున్న రాష్ట్ర భవితవ్యం ..

భారత్ న్యూస్ విశాఖపట్నం..గూగుల్ డేటా సెంటర్ తో మారనున్న రాష్ట్ర భవితవ్యం ..

Ammiraju Udaya Shankar.sharma News Editor…నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు

అవనిగడ్డ : విశాఖపట్నం నగరానికి గూగుల్ సంస్థ భారీ పెట్టుబడితో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం రాష్ట్రానికి ఒక చారిత్రాత్మక పరిణామమని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిందని గూగుల్ విశాఖకు రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి గేమ్ చేంజర్ మారనుందని ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, వైద్యం, విద్య రంగాలు మెరుగుపడతాయని అందరు ముక్తా కంఠం తో నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలియచేస్తూ అవనిగడ్డ వంతెన సెంటర్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే శ్రీనివాసరావు,పరుచూరి దుర్గా ప్రసాద్, బండే రాఘవ,మండలి రామ్మోహన రావు, మేడికొండ విజయ్, ఘంటశాల రాజమోహన రావు, దాసినేని శ్రీనివాసరావు, అడపా శ్రీను,కంచర్ల ఆనంద్, కోట సాయి, బచ్చు రమణ,మెరుగు సోమిరెడ్డి,దాసినేని సాంబయ్య, నంబూరి వెంకటేశ్వరరావు, కొండవీటి గోవింద్,మెగవత్తు గోపి,గుగ్గిలం శ్యామ్ కుమార్,కొక్కిలిగడ్డ జాన్ విల్సన్, కమ్మిలి సుబ్రమణ్యం,మెరుగు రంగనాథ్, నాగిడి రాంబాబు, సిద్ధాబత్తుని హరిబాబు తదితరులు పాల్గొన్నారు