భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కంచుకోటలు ఖాళీ అవుతున్నాయి..!
బస్తర్, అబూజ్‌మడ్.. మావోయిస్టులకు కంచుకోటలు. ఎన్నో భీకర ఎన్‌కౌంటర్లకు వేదికలు.
కానీ ఇప్పుడు అక్కడ తుపాకీ మూగబోతోంది. నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో వందల మంది మావోలు మరణించారు.
దిక్కుతోచని స్థితిలో అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లాంటివారు కూడా లొంగిపోయారు. అబూజ్‌మడ్, నార్త్ బస్తర్ మావోరహిత ప్రాంతాలుగా మారాయని, ఇక మిగిలింది దక్షిణ బస్తరేనని అమిత్ షా ప్రకటించారు
