భారత్ న్యూస్ నెల్లూరు….నేడు శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రయల్ రన్..
Oct 16, 2025,

శ్రీశైలంలో గురువారం ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో, ఆయన కాన్వాయ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ సందర్భంగా రెండు గంటల పాటు శ్రీశైలం ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసి, రూట్ క్లియరెన్స్ చేపట్టారు. భద్రతా విభాగం, పోలీసు శాఖలు కలిసి మొత్తం మార్గాన్ని పరిశీలించాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.