కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట – వాసంశెట్టి శుభాష్

భారత్ న్యూస్ గుంటూరు…కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట – వాసంశెట్టి శుభాష్

కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి శుభాష్ అన్నారు మంగళవారం అవనిగడ్డ ఆర్యవైశ్య కళ్యాణమండపంలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ సమావేశానికి తరలిరాగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ పార్టీ కార్యకర్తలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ పదవుల విషయంలో తమకు తగిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేయగా పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరిని పార్టీ మర్చిపోదని కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా నారా లోకేష్ పనిచేస్తున్నారని అన్నారు అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించడంతో ఇక్కడ కార్యకర్తలకు ఇన్చార్జి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఈ విషయమై అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని తెలిపారు నామినేటెడ్ పదవులు వివిధ సమీకరణల మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకుందని అయితే నియోజకవర్గం లో పదవుల విషయంలో మిగిలిన మండలాలకు తగిన ప్రాధాన్యత రాని విషయాన్ని తాము ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకెళ్లామని రాబోయే నియామకాల్లో నియోజవర్గంలోని ఆరు మండలాల్లో సమ ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు ఇటీవల తన మంత్రిత్వ శాఖ పనుల ఒత్తిడి కారణంగా అవనిగడ్డ నియోజకవర్గనికి ఎక్కువగా రాలేకపోయానని ఇకపై కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజవర్గంలో పార్టీ అత్యంత పటిష్టంగా ఉందని ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం ఇన్చార్జి లేకపోవడం తో కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని త్వరలో పార్టీ అధినాయకత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని అన్నారు మంత్రి సుభాష్, పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు తాను నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు

అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు అధికారులు నేటికీ వైసీపీ జమానాలో వ్యవహరించినట్లుగానే వ్యవహరిస్తున్నారని ఇకపై ఇలాంటివి సహించేది లేదని హెచ్చరించారు నియోజకవర్గం లో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు ఇన్చార్జి మంత్రి సుభాష్ దృష్టికి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు దృష్టికి తీసుకువచ్చారు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులు ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నామినేటెడ్ పదవుల విషయంలో తాను ఇన్చార్జి మంత్రి ద్వారా నివేదికలు పంపించామని పార్టీ పనిచేసిన ప్రతి నాయకుడికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు