భారత్ న్యూస్ గుంటూరు…కృష్ణాజిల్లా, మచిలీపట్నం :
కల్తీ మద్యంపై కృష్ణాజిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నిరసన
మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
నిరసన అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేత
పేర్ని నాని కామెంట్స్ :
కల్తీ మద్యం కేసును మాఫీ చేసే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం పూనుకుంది – పేర్ని నాని
జనార్ధనరావును అరెస్ట్ చేసిన తీరు ఇందుకు నిదర్శనం

గన్నవరం ఎయిర్ పోర్టులో అల్లుడిని స్వాగతించినట్టు స్వాగతించి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు..
జనార్ధనరావు ఆఫ్రికా నుండి ముంబై, ముంబై నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు వస్తే ముంబై కు ఎందుకు వెళ్లి అరెస్ట్ చేయలేదు