బాణా సంచా తీసుకెళ్తే జైలుకే

భారత్ న్యూస్ విశాఖపట్నం..బాణా సంచా తీసుకెళ్తే జైలుకే

రైళ్లో బాణాసంచా తీసుకువెళ్లటంపై నిషేధం ఉంది.

రైళ్లలో బాణసంచా తీసుకెళ్లే సమయంలో చిన్న నిప్పు రవ్వ పడినా రైలు మొత్తం దగ్ధమయ్యే అవకాశం ఉంది. భారీ నష్టంతో పాటు వందల మంది ప్రయాణికుల ప్రాణాల ముప్పు కలిగిస్తుంది. అందుకే దీపావళి వేళ రైల్వే భద్రత విభాగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.1000 జరిమానా, 3ఏళ్ల జైలు శిక్ష లేకుంటే ఈ రెండు కూడా విధించవచ్చని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి