భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఇక పై పిన్ లేకుండానే UPI పేమెంట్స్
భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో విప్లవాత్మక మార్పు రాబోతోంది. రోజూ లక్షలాది మంది వినియోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతోంది. ఇకపై యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి 4 లేదా 6 అంకెల పిన్ అవసరం లేదు. అక్టోబర్ 8 నుంచి వినియోగదారులు తమ ముఖ గుర్తింపు లేదా వేలిముద్రతోనే చెల్లింపులను ఆమోదించవచ్చు. యూపీఐ నెట్వర్క్ను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ ఆధునిక ఫీచర్ను ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో ఆవిష్కరించనుంది ఇక మీదట మీ గుర్తింపే మీ పాస్వర్డ్!
