..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టిడిపి దూరం?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగ నుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించను న్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది.
గత ఎన్నిల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం సాధించిన మాగంటి గోపీ నాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది.
దీంతో ఆమె ఇప్పటికే ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. బీసీ వ్యక్తిని బరిలోకి దింపుతామని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. రెండు రోజుల్లో అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది.

మరోవైపు బీజేపీ ఉప ఎన్నిక పోరులో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ మూడు పార్టీలతో పాటు టీడీపీ కూడా పోటీలో ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, ఈ అంశంప