భారత్ న్యూస్ విజయవాడ…ప్రజా ఫిర్యాదుల ను చట్ట పరిధిలో పరిష్కరిస్తూ వారికి బాసటగా నిలవాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,
మీకోసం ద్వారా స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వండి – జిల్లా ఎస్పీ.
ప్రజలు వారి యొక్క దైనందిన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య గూర్చి పరిష్కారం కోసం పోలీస్ శాఖను ఆశ్రయిస్తారు. అలా నమ్మకంతో పోలీసులను ఆశ్రయించే ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యను సానుకూలంగా విని, చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి, వారి సమస్యకు పరిష్కారం అందిస్తామనే నమ్మకాన్ని వారిలో పెంపొందించాలని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు అన్నారు.
▪️ఈరోజు జిల్లా నలుమూలల నుండి మీకోసం కార్యక్రమానికి ప్రజలు రాగా వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి ,వారి సమస్య పూర్వా పరాలను తెలుసుకొని, ఆ సమస్య గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, వాటిని చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈరోజు మీకోసం కార్యక్రమానికి మొత్తం 42 ఫిర్యాదులు రాగా అందులో…
వేదమంత్రాలు సాక్షిగా తాళి కట్టిన భర్త కడదాకా తోడుంటాడు అనుకుంటే అదనపు కట్నం కోసం తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని న్యాయం చేయమని బంటుమిల్లి నుండి వనిత అనే వివాహిత ఫిర్యాదు.
కడుపున పుట్టిన బిడ్డలు కష్టకాలంలో తోడవుతారు అనుకుంటే, కూడు పెట్టకుండా కష్టాలపాలు చేస్తున్నారని వారి నుండి రక్షణ కల్పించి న్యాయం చేయమని కోడూరు నుండి రమణమ్మ అనే వృద్ధురాలు ఫిర్యాదు.
కష్టాల్లో ఉన్నాను ఆర్థిక సహాయం చేయమంటే స్నేహితుడిని నమ్మి అప్పు ఇచ్చినందుకు అప్పు తిరిగి చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతూ దూషణ మాటలు మాట్లాడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని న్యాయం చేయమని పెనమలూరు నుండి వంశి అనే వ్యక్తి ఫిర్యాదు.
ఇవే కాకుండా కుటుంబ కలహాలు, ఆస్తి విభేదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఉద్యోగ మోసాలు, సరిహద్దు వివాదాలు, మొదలైన అంశాల గూర్చి ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదులన్నీటిని సంబంధిత అధికారులకు బదిలీ చేసి చట్టపరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కారం అందించాల్సిందిగా ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు.
ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి. నాయుడు గారు మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు
