తెలంగాణ :
…భారత్ న్యూస్ హైదరాబాద్…స్థానిక ఎన్నికలు.. కాంగ్రెస్ సర్కార్ ‘ప్లాన్ బీ’
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే..
అందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుని ‘ప్లాన్ బీ’ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.

సుప్రీం, హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే (50 శాతానికి లోబడి) ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2011 జనాభా లెక్కల ఆధారంగా ST, SC రిజర్వేషన్లను ఖరారు చేసినందున, వాటిని అలాగే ఉంచి గతంలో మాదిరిగా బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పిస్తారని సమాచారం..