32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం

భారత్ న్యూస్ ఢిల్లీ…..32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం

భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిలిపివేసిన 32 విమానాశ్రయాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 15 వరకు విమానాశ్రయాలను మూసివేయాలని భావించినా, పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు అవి మళ్లీ తెరుచుకునేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది.