భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పెద్దపులి దాడిలో పశువు మృతి
సిర్పూర్ టీ మండలం చీలపల్లి గ్రామానికి చెందిన ఏల్పుల తిరుపతికి చెందిన లేగ దూడ గురువారం రిజర్వ్ ఫారెస్ట్ లో మేతకు వెళ్ళగా, పెద్దపులి దాడిలో మరణించింది. సమాచారం అందుకున్న ఎఫ్బివో సంతోష్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, నష్టపరిహారానికై ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. సిర్పూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని, గ్రామస్థులు జాగ్రత్త వహించాలని, పులి జాడ తెలిసినట్లయితే వెంటనే సమాచారం అందించాలని ఎఫ్ఆర్వో ప్రవీణ్ కుమార్ తెలిపారు…..
