భారత్ న్యూస్ మంగళగిరి…బాల్య వివాహం: 14 మందిపై కేసు నమోదు
పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం కొండూరులో 16 ఏళ్ల మైనర్ బాలికకు వివాహం జరిపినందుకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చర్యలు తీసుకున్నారు. పెళ్లికొడుకు, ఇరువైపులా తల్లిదండ్రులతో పాటు పురోహితుడు, ఫొటోగ్రాఫర్, మండపం నిర్వాహకుడు సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని శిశు సంక్షేమశాఖ హోమ్‌కు తరలించారు. మైనర్ వివాహాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు….
