ముంచుకొస్తున్న వాయుగుండం.. తెలంగాణకు భారీ వర్ష సూచన

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ముంచుకొస్తున్న వాయుగుండం.. తెలంగాణకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఏపీతో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు…..