మావోయిస్టులు ఆయుధాలు వదిలితే సహకరిస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మావోయిస్టులు ఆయుధాలు వదిలితే సహకరిస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి

నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి, మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, ఆయుధాలు వీడితే సహకరిస్తామని పిలుపునిచ్చారు. చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, మావోయిస్టులు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని, టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. 17 వేల పోలీసు ఖాళీల భర్తీకి సీఎంకు ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు….