భారత్ న్యూస్ అనంతపురం…ఉపాధి హామీ పథకం లో కొత్త మార్గదర్శకాలు
ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి eKYC తప్పనిసరి
🪪 జాబ్ కార్డులకు ఆధార్ లింక్ చేయాలి
రోజుకు రెండు సార్లు ఫోటో ఆధారిత హాజరు నమోదు చేయాలి
ఒకరి బదులు మరొకరు ఫొటోలు అప్లోడ్ చేయడం ఇక అసాధ్యం
నిజంగా పనిచేసిన శ్రామికులకే వేతనాలు నేరుగా బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయి
అక్టోబర్ 1 నుండి కొత్త విధానం అమలు
ఆంధ్రప్రదేశ్లో కర్నూలు & చిత్తూరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్
రాష్ట్రవ్యాప్తంగా 70.73 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి
చాలామంది నిజంగా పనికి హాజరు కాకపోవడం వల్ల బోగస్ ఫొటోలు అప్లోడ్ అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి
ఇంతకుముందు ప్రవేశపెట్టిన NMMMS యాప్ లోపాలు బయటపడ్డాయి
ఫీల్డ్ అసిస్టెంట్లు నకిలీ ఫొటోలు అప్లోడ్ చేసి జీతాలు పొందినట్లు తేలింది
ఇప్పుడు కఠినమైన ముఖ ఆధారిత eKYC సిస్టమ్ అమలు

ఉపాధి హామీ పథకంలో అవినీతి తగ్గుతుంది
నిజమైన శ్రామికులకు మాత్రమే వేతనాలు అందుతాయి
బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట పడుతుంది
ప్రభుత్వ డబ్బు సరైన లబ్ధిదారులకు చేరుతుంది
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో తీసుకొస్తున్న కొత్త eKYC & ఆధార్ అనుసంధానం విధానం నిజమైన కూలీలకు ఎంతో ఉపయోగకరం
ఇకపై బోగస్ మస్టర్లు, నకిలీ ఫొటోలు, ఫీల్డ్ అసిస్టెంట్ల దుర్వినియోగం జరగదని అధికారులు చెబుతున్నారు
అయితే ఈ కొత్త విధానం ఎంతవరకు విజయవంతమవుతుందో సమయం చెబుతుంది