డ్వాక్రా మహిళలకు తీపికబురు చెప్పిన సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ రాజమండ్రి…డ్వాక్రా మహిళలకు తీపికబురు చెప్పిన సీఎం చంద్రబాబు

వారి పిల్లల చదువు, ఆడబిడ్డల వివాహాలకు పావలా వడ్డీకే రూ.లక్ష రుణం. స్త్రీనిధి కింద అందజేత.

రెండు కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం.

డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం.

వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’,

ఆడబి డ్డల వివాహాలకు చేయూతనిచ్చేలా ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’.

ఈ రెండు పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూ లన సొసైటీ (సెర్ప్) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోదముద్ర వేశారు