భారత్ న్యూస్ విజయవాడ…నేటి నుంచి ఓపీ సేవలు నిలిపేస్తాం: PHCDA వెల్లడి
అమరావతి :
ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేటి నుంచి OP సేవలు నిలిపివేస్తామని పీహెచ్సీ వైద్యుల సంఘం (PHCDA) ప్రకటించింది. తమ సమస్యలపై
ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా అత్యవసర సేవలూ ఆపేస్తామని తెలిపింది. రేపటి నుంచి అక్టోబర్ 3 వరకు నిరసన ర్యాలీలు, దీక్షలు చేపడతామంది. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్దరించాలని, పదోన్నతులు కల్పించాలని, అలవెన్సులు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
