- రాళ్లు రువ్వారు.. లాఠీఛార్జి చేశారు
- తమిళ సినీ నటుడు విజయ్ సంచలనం
- అందుకే ఈ ఘోరం జరిగిందని ఆరోపణ
భారత్ న్యూస్ విశాఖపట్నం..తొక్కిసలాట వెనుక కుట్ర

Ammiraju Udaya Shankar.sharma News Editor…తమిళ హీరో, తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీ అధినేత విజయ్… శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హింసాత్మక ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. ర్యాలీపై రాళ్ల దాడి… ఆ వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేయడమే తొక్కిసలాటకు కారణమని ఆయన ఆరోపించారు. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ఈ వివాదాన్ని ఆయన మరింత రాజకీయం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై రాజకీయ శత్రుత్వం వల్లే జరిగిన చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం.Ammiraju Udaya Shankar.sharma News Editor…
హైకోర్టులో అత్యవసర విచారణ…
విజయ్ తన న్యాయ నిపుణులతో ఉదయం జరిపిన చర్చల అనంతరం ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సెలవులు ఉన్నప్పటికీ దీనిని అత్యవసరంగా విచారించాలన్న విజయ్ విజ్ఞప్తిని జస్టిస్ దండపాణి అంగీకరించారు. రేపు (సోమవారం) మధురై బెంచ్‌లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఓ జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్టాలిన్ ప్రకటించినప్పటికీ ఆ ప్రక్రియపై నమ్మకం లేదంటూ కుట్ర కోణంపై స్వయంగా హైకోర్టు లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని టీవీకే పట్టుబడుతుంది. ఈ వ్యవహారాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకోవాలన్న విజయ్ వ్యూహంగా కనిపిస్తోంది.
