అక్టోబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ

భారత్ న్యూస్ అమరావతి..అక్టోబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రానున్నారు.

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

శ్రీశైలం మల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకోనున్నారు.

కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతల రోడ్‌షో ఉండనుంది.

జీఎస్టీ సంస్కరణలపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఈ మేరకు మోదీ పర్యటన వివరాలను మంత్రి లోకేశ్ శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీల వద్ద ప్రస్తావించారు.