భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ములుగు: టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక
పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు.
