18వ సారి రక్తదానం చేసిన హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు తిరువూరు కామెడీ స్టార్ ఫజల్ భాయ్…….!

భారత్ న్యూస్ విజయవాడ…18వ సారి రక్తదానం చేసిన హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు తిరువూరు కామెడీ స్టార్ ఫజల్ భాయ్…….!

రక్తదానం మరొకరికి ప్రాణ దానం

నిరంతరంగా రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు…..

ఎన్టీఆర్ జిల్లా

తిరువూరు

పట్టణ పరిధిలోని స్థానిక బోసు బొమ్మ సెంటర్ ఎంవీఎస్ సర్జికల్ (డాక్టర్ రమేష్ బాబు) హాస్పిటల్ నందు తెలంగాణ రాష్ట్రం వి ఎం బంజర మండలం రంగారావు బంజర గ్రామానికి చెందిన కె.యశోద గర్భసంచి కడుపులో కనితి తో బాధపడుతూ చికిత్స పొందుతుంది .. ఆమెకు అత్యవసరంగా సర్జరీ నిమిత్తం ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ రెండు ప్యాకెట్లు అవసరం కాగా తిరువూరు హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ మద్దిబోయిన నరేష్ (తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు) ని ఫోన్లో సంప్రదించారు… వెంటనే స్పందించిన నరేష్ గ్రూపు సభ్యులైన తిరువూరు కామెడీ స్టార్ ఫజల్ భాయ్ కి తెలపగా క్షణాల వ్యవధిలో హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది…

ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ గౌరవాధ్యక్షులు మల్లాది సూర్యప్రకాశరావు, మద్దిబోయిన నరేష్ , సిరికొండ అభి వరలక్ష్మి( పరిపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ), మర్సకట్ల దిలీప్ కృష్ణవేణి, ఎంపీటీసీ కంచపోగు గోపాలకృష్ణ, రాయపూడి నాగముత్యం, మల్లాది ప్రశాంత్, గుగులోతు అశోక్, జరపాల ప్రకాష్, ల్యాబ్ టెక్నీషియన్ ఇస్లావత్ అర్జున్ పాల్గొన్నారు….

అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించి క్షణాల వ్యవధిలో హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన కామెడీ స్టార్ ఫజల్ బాయ్ కి యశోద కుటుంబ సభ్యులు మరియు డాక్టర్ రమేష్ బాబు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు….