మహిళ వేషధారణలో దొంగతనానికి పాల్పడ్డ యువకుడు

…భారత్ న్యూస్ హైదరాబాద్….మహిళ వేషధారణలో దొంగతనానికి పాల్పడ్డ యువకుడు

లోన్ యాప్‌లో తీసుకున్న రుణాలు చెల్లించేందుకు స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం

హైదరాబాద్ – బంజారాహిల్స్ ఉదయ్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ కుటుంబంతో కలిసి నిజామాబాద్‌కు వెళ్లిన శివరాజ్ అనే వ్యక్తి

ఇదే విషయం లింగంపల్లిలో సీసీ కెమెరా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు హర్షిత్‌కు తెలిపిన శివరాజ్ కుమారుడు

లోన్ యాప్‌లో తీసుకున్న రుణాలు పెరిగిపోవడంతో, ఆడవేషంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి 6.75 తులాల బంగారం, రూ.1.10 లక్షల నగదు కాజేసిన హర్షిత్

ఊరి నుండి వచ్చి చూసేసరికి నగదు బంగారం మాయమవడంతో, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హర్షిత్ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు