ఈపీడీసీఎల్ సీవీవో ఆధ్వర్యంలో స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ

భారత్ న్యూస్ గుంటూరు…ఈపీడీసీఎల్ సీవీవో ఆధ్వర్యంలో స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ కింజరాపు వెంకట రామకృష్ణ ప్రసాద్ ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ ఆఫీస్ పరిసరాలలో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం లో భాగంగా మొక్కను నాటి సిబ్బందితో కలిసి స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సర్కిల్ ఎస్ఈ శ్రీ జి.శ్యాంబాబు, విజిలెన్స్ & ఏపీటిఎస్ సీఐ శ్రీ ఇ.వెంకునాయుడు, జోన్-1 డిఈ శ్రీ పోలాకి శ్రీనివాసరావు, డిఈ టెక్నికల్ శ్రీ ఎం.ధర్మరాజు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విజిలెన్స్ & ఏపీటిఎస్ విశాఖపట్నం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కార్యక్రమంలో భాగంగా సీవీవో శ్రీ రామకృష్ణ ప్రసాద్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేసి, అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.