భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణ : సర్పంచ్ ఎన్నికలు.. పింఛన్ల పెంపు లేనట్లేనా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంచుతామని..
ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా ఇంకా ఆసరా పింఛన్లు పెంచలేదు.
స్థానిక ఎన్నికల్లోనైనా పెంచుతారు అనుకుంటే.. ప్రభుత్వం వద్ద నికర ఆదాయం లేదని, ఉన్న ఆదాయం అప్పుకట్టడానికే సరిపోతుందని సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారు.

దీంతో స్థానిక ఎన్నికల్లో కూడా పింఛన్ల పెంపు లేనట్లు కనిపిస్తోంది.