బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా జరిగే చలో విజయవాడ ను జయప్రదం చేయండి : – వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ
భారత్ న్యూస్ సత్యసాయి జిల్లా : ఈరోజు ఉదయం తొంగోడు గ్రామపంచాయతీ పరిధిలో చిన్న బాబాయ్ పల్లి తుంగోడు కూకట్ మానేపల్లి గ్రామాలలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న పర్యటించే సర్వే నంబర్ 28 లో సాగులో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడుతూ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సాగుదారులతో కలిసి కరపత్రం విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు , పరిశ్రమలు అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తోంది.
భూమినే నమ్మకం జీవిస్తున్న సాగుదారులు పేదలు దళిత గిరిజనులు బలహీన వర్గాల వారు తీవ్రంగా భూ సేకరణలో న్యాయబద్ధంగా నష్టపరిహారం పునరావాసం అందక నష్టపోవడమే కాకుండా వలసలు తప్పడం లేదు. అదేవిధంగా తుంగోడు చిన్న బాబయ్య పల్లి కావేటి నాగేపల్లి కూకట్ మానేపల్లి తదితర గ్రామాల్లో సర్వే నంబర్ 28 నందు దాదాపు నాలుగు దశాబ్దాలుగా పేదలు సాగులో ఉన్నారు పట్టాలో పాస్‌బుక్కులు ఇవ్వాలని అనేకమార్లు మండల తహసిల్దార్ ఆర్డీవో కలెక్టర్ వారికి దరఖాస్తులు చేసుకొని నిరసన చేసిన న్యాయం జరగడం లేదు అందుకనే గత్యంతరం లేక ఈనెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని సాగుదారులకు హక్కులు కల్పించాలని భూ పరిపాలన రాష్ట్ర కమిషనర్ వారికి వ్యక్తిగత దరఖాస్తులతో చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సాగుదారులు సురేష్ , రత్నమ్మ , రామాంజనేయులు , అంజినప్ప , బాబు , భావన్న , రంగప్ప , చిన్నాఓబులేషప్ప , కిష్టప్ప, సన్నాయప్ప , గంగమ్మ , అశ్వర్థమ్మ , సుధాకర్ , రాములమ్మ , భాగ్యమ్మ , లక్ష్మమ్మ , తదితరులు పాల్గొన్నారు.
