సంగారెడ్డి జైలులో గంజాయి దొరక్క ఖైదీల వీరంగం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సంగారెడ్డి జైలులో గంజాయి దొరక్క ఖైదీల వీరంగం

గాజు పెంకులతో ఒళ్ళంతా గాట్లు పెట్టుకుని, అవే గాజు పెంకులు మింగి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు

సంగారెడ్డి జిల్లాలోని జైలుకు హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు నిందితులు

గంజాయి బానిసలుగా జైలుకు వచ్చి, గోడ గడియారం బ్యాటరీ, పెన్ను మూతను మింగేసి, గాజు పెంకులు తిన్నామని కడుపు నొప్పిగా ఉందని జైలు అధికారులకు తెలిపిన ఖైదీలు

దీంతో వారిని సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యం చేసుకునేందుకు నిరాకరించి, వైద్యులను, సిబ్బందిని దూషించడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు

ఉస్మానియా ఆసుపత్రిలో మరింత గొడవ చేస్తూ, ఆసుపత్రి మంచాన్ని విరగొట్టి, విరిగిన మంచం ముక్కతో అద్దాలు పగలకొట్టి, దగ్గరికి వస్తే గాజు పెంకులు మింగేస్తామని, వైద్యులను, పోలీసులను బెదిరించిన ఖైదీలు

వారి మానసిక పరిస్థితి బాగాలేదని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించగా, మానసిక పరిస్థితి బాగానే ఉందని తెలియడంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఎట్టకేలకు గాంధీ ఆసుపత్రిలో ఎక్స్‌రే తీసి, గడియారం బ్యాటరీ, పెన్ను మూత మింగేశారని తేల్చి, వైద్యం చేసి డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి సిబ్బంది

గంజాయికి బానిసలుగా మారి నిత్యం ఏదో ఒక నేరం చేస్తుంటారని, వారిని అదుపు చేయడం చాలా కష్టమవుతుందని వాపోతున్న జైలు అధికారులు