భారత్ న్యూస్ అనంతపురం…గుడ్న్యూస్.. ఇకపై AC బస్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం
అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లను ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
త్వరలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామని, వీటిని పల్లె వెలుగు బస్సులుగా వినియోగిస్తామని వెల్లడించారు.
ఇకపై మహిళలు ఏసీ బస్లలోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
అలాగే ఆర్టీసీ ఆస్తులను ఎవరికీ ధారాదత్తం చేయడం లేదని, ప్రత్యామ్నాయ డిపోలు ఏర్పాటు చేసే వరకు అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
