భారత్ న్యూస్ అనంతపురం…రాయలసీమ జిల్లాలకు తీవ్ర పిడుగుల హెచ్చరికఅమరావతి:
ఈ మ్యాప్‌లో అన్ని స్పష్టంగా సూచించారు.
రాయలసీమ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో రెండు రోజుల్లో వర్షాలు మరింత విస్తృతంగా, భారీగా, తీవ్రంగా కురుస్తాయి.
చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, తిరుపతి (పశ్చిమ), అనంతపురం (తూర్పు), సత్యసాయి (తూర్పు) జిల్లాల్లో రాత్రి, అర్థరాత్రి వేళల్లో భారీ వడగళ్లు, వర్షాలు కురుస్తాయి.
కొన్నిసార్లు తెల్లవారుజాము వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.
కర్నూలు, నంద్యాల, రాయలసీమలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి.