భారత్ న్యూస్ మంగళగిరి…వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారికి భారీగా హుండీ ఆదాయం
27 రోజులకు 1.49 కోట్ల ఆదాయం
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం రూ.1,15,09,966లు ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.34,11,312 ల ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను రూ.1,49,21,278 లు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదు తో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం నాలుగు దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి,అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్, ఎం సత్యనారాయణ, వెలిచేరు గ్రూప్ త్రీ దేవాలయాల తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది, హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
