భారత్ న్యూస్ మంగళగిరి…నాగాయలంక మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన…??!!

Ammiraju Udaya Shankar.sharma News Editor…కృష్ణాజిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మరి కొద్ది సేపట్లో నాగాయలంక మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని ఎదురుమొండి దీవిలో గొల్లమంద వద్ద కృష్ణానది కోతకు గురవుతున్న జింకపాలెం ప్రధాన రహదారి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కలెక్టర్ బాలాజీ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటనకు వస్తున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్ సభ ఏటిమొగ మార్కెట్ యార్డు లో జరిపే అవకాశం ఉన్నందున ఆయన పర్యటనకు సంబంధించి ఏటిమొగ మార్కెట్ యార్డు ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం ఎదురుమొండి దీవిలోకి వెళ్లకుండా ఈ మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరిగే సభ నుంచి పనులకు వర్చువల్ గా శ్రీకారం చుడతారని భావిస్తున్నారు. దీవి పర్యటన పవన్ కళ్యాణ్ కు కష్ట సాధ్యం అవుతుంది కాబట్టి నదికి ఇవతలి వైపున సమీపంలోని ఏటిమొగ లో ఆయన పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించనున్నారు
