జయపురంలో రాత్రికి రాత్రే అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు పంచాయతీ అధికారుల అండదండలతో

భారత్ న్యూస్ నెల్లూరు….జయపురంలో రాత్రికి రాత్రే అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు పంచాయతీ అధికారుల అండదండలతో

ఇరిగేషన్ స్థలాలలో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న జయపురం పంచాయతీ

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం

జయపురం ప్రభుత్వ ఇరిగేషన్ స్థలాలలో అక్రమ కట్టడాలను ప్రోత్సహించవద్దని ప్రభుత్వాలు అధికారులు ఎన్నిసార్లు మొత్తుకున్నా స్థానిక నేతల అన్నదండలతో పేట్రేగిపోతున్న అక్రమ నిర్మాణ నిర్వహకులు.

అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయడం, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి.

ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన వాటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.

ముఖ్యంగా జూలై 2024, తర్వాత నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయం వంటివి పాటించాలి.

రాత్రికి రాత్రి అక్రమక నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు.

కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారా మరి దగ్గరుండి కట్టిస్తున్నారా.

ఇరిగేషన్ ఆర్ ఎన్ బి స్థలాలలో శాశ్వత కట్టడాలు నిర్మిస్తుంటే అధికారులు చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు.

కొందరు గల్లీలు లీడర్లు అండతో ఏ పనికైనా పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తక్షణమే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది.