భారత్ న్యూస్ అనంతపురం…సోమందేపల్లి చెరువు కట్ట పరిశీలన* సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ ఏఈ వినోద్ కుమార్. చెరువు డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ తో కలిసి శనివారం చెరువుకట్టను పరిశీలించిన ఇరిగేషన్ వినోద్ కుమార్. ఇప్పటికే చెరువు కట్టకు అటు ఇటు ఉన్న ముళ్ల కంపలను తొలగించారు. ప్రస్తుతం చెరువులో తూము పనులు, చెరువు కట్టపై మట్టి తోలడం, పొలాలకు వెళ్లే కాలువను మరమ్మతులు వంటి పనులను పరిశీలించారు. వీటికి సంబంధించి ఎస్టిమేషన్ తయారుచేసి త్వరలోనే వీటి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఏఐ నాయకులకు తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసి పొలాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఏఈ ని నీరుగంటి చంద్రశేఖర్ కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వడ్డే సురేష్, త్రిమన్ కమిటీ సభ్యులు క్రిష్టప్ప, బాబయ్య, మహేంద్ర, నాయకులు మద్దిలేటి, అన్సర్, షాషావలి, గాజుల గోపి పరంధామ, వేణు మండల జనసేన కన్వీనర్ జబీ వుల్లా తదితరులు పాల్గొన్నారు.
