భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..

A. Udaya Shankar.sharma News Editor…అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏపీలో ఇక ఇంటికే ఉచితంగా డాక్యుమెంట్స్
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పై కుల ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
అక్టోబరు 2వ తేదీ నుంచి నేరుగా ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం పంపేందుకు సర్కార్ చర్యలు తీసుకోంది.ఇందుకోసం ఇంటింటికి సర్వే చేసి అర్హులను గుర్తిస్తున్నారు
ఈ సర్వేలో ఆధార్, రైస్ కార్డు, విద్యార్హత వంటి వివరాలను పరిశీలిస్తున్నారు.
ప్రజలకు సులభంగా ఈ డాక్యుమెంట్స్ అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
