తెలంగాణ డ్వాక్రా మహిళలకు గుడ్‌ న్యూస్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణ డ్వాక్రా మహిళలకు గుడ్‌ న్యూస్‌

📍తెలంగాణ ప్రభుత్వం RTC బస్సుల కొరతను అధిగమించేందుకు కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి బస్సులు కొనుగోలు చేయించి, వాటిని RTCకి అద్దెకు ఇవ్వనుంది.

ప్రభుత్వం రూ.30 లక్షల సహాయం అందిస్తే, సంఘాలు రూ.6 లక్షలు జోడించి బస్సు కొనుగోలు చేయొచ్చు.

దీతో మహిళలకు నెలవారీ స్థిర ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు, మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో పెరిగిన రద్దీకి ఇది పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.